మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Saraswati Ashtottara Shatanama Stotram – శ్రీ సరస్వతి అష్టోత్తరశతనామ స్తోత్రం


సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 ||

శివానుజా పుస్తకధృత్ జ్ఞానముద్రా రమా పరా |
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 ||

మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా |
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా || 3 ||

మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా |
సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || 4 ||

చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా |
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా || 5 ||

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా |
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా || 6 ||

జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా |
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా || 7 ||

సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా |
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా || 8 ||

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా |
త్రయీమూర్తీ త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || 9 ||

శుంభాసురప్రమథినీ శుభదా చ సర్వాత్మికా |
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || 10 ||

ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా |
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || 11 ||

కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ |
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా || 12 ||

చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా |
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరా సుపూజితా || 13 ||

శ్వేతాసనా నీలభుజా చతుర్వర్గఫలప్రదా |
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || 14 ||

హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ || 15 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.